Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ప్రాణాలు తీసిన మాదక ద్రవ్యాల మత్తు... పెన్సిల్వేనియాలో విషాదం

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. హెరాయిన్‌ను అతిగా తీసుకోవడం వల్ల దంపతులతో పాటు వారి బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ మరణాలు సంభించిన వారం రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (14:12 IST)
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. హెరాయిన్‌ను అతిగా తీసుకోవడం వల్ల దంపతులతో పాటు వారి బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ మరణాలు సంభించిన వారం రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు దాదాపు 60 మైళ్ల దూరంలోని జాన్స్‌టౌన్‌ అనే పట్టణానికి చెందిన జాసన్‌ ఛాంబర్స్‌(27), చెల్సియా కార్డారో(19) అనే దంపతులు ఉన్నారు. వీరికి ఐదునెలల చిన్నారి సమ్మర్‌ చాంబర్స్‌లు ఉంది. 
 
అయితే, జాసన్ దంపతులకు హెరాయిన్ తీసుకునే అలవాటు ఉంది. అయితే, వీరిద్దరు తమ ఎంజాయ్‌మెంట్ కోసం మోతాదుకు మించి తీసుకున్నారు. ఈ కారణంతో వీరు నివసించే ఇంటి మొదటి అంతస్తులో భర్త చాంబర్స్‌ మృతి చెంది ఉండగా.. రెండో అంతస్తులోని బాత్‌రూమ్‌లో చెల్సియా మృతి చెందారు. 
 
వీరిద్దరు చనిపోయి వారంరోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారువచ్చి... ఇంటిని పరిశీలించగా రెండు మృతదేహాలను కనుగొన్నారు. ఆ తర్వాత మరో పడక గదిని తనిఖీ చేయగా, అందులో ఉన్న ఉయ్యాలలోనే ఐదేళ్ళ చిన్నారి మృతదేహం కనిపించింది. చిన్నారి చెల్సియాకు ఆలనపాలన లేకపోవడంతోనే మృతి చెందివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. 
 
స్థానికంగా ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ కుటుంబం ఇటీవలే న్యూయార్క్‌ నుంచి పెన్సిల్వేనియాకు వలస వచ్చింది. గతంలో జాసన్‌ ఛాంబర్స్‌ హెరాయిన్‌ అధికంగా వాడటంతో అతనికి విరుగుడు కోసం నార్కాన్‌ అనే మందును కూడా వాడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments