Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి రక్తబొట్టు వరకు కాశ్మీర్ కోసం పోరాడుతాం : పాకిస్థాన్

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (13:20 IST)
తమ అజెండాలో ఉన్న అంశాల్లో కాశ్మీర్ అజెండా ఒకటనీ, దానికోసం తమ ప్రతి ఒక్క సైనికుడు చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతామని పాకిస్థాన్ ప్రకటించింది. ఇదే అంశంపై పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా స్పందిస్తూ, కాశ్మీర్‌ పాకిస్థాన్ ముఖ్య ఎజెండాలో ఒకటి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము ఓ సవాలుగా భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కాశ్మీర్‌‌ను వదిలుకునే ప్రసక్తే లేదు. మా సైనికుడు తన చివరి రక్తపు బొట్టు, చివరి బుల్లెట్‌ అయిపోయే వరకూ, తుది శ్వాస ఆగే వరకూ పోరాడుతూనే ఉంటాడు అని ఘాటుగా స్పందించారు.
 
అంతేకాకుండా, కాశ్మీర్ ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమేనని, లోయలో బలవంతంగా హిందుత్వాన్ని రుద్దేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కాశ్మీర్ ప్రజల కోసం యుద్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
మరోవైపు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన 370 అధికరణను రద్దు చేసి నెల రోజులుదాటిపోయినప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం తన బీరాలు, ప్రగల్భాలు మాత్రం మానుకోవడం లేదు. నియంత్రణ రేఖ వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, సరిహద్దులకు భారీ సంఖ్యల బలగాలను తరలిస్తోంది. పైగా, భారత్‌లో అల్లర్లు, విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments