Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (21:55 IST)
సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంలో తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్‌కు తెలుసొచ్చింది. మొన్నటివరకు ఈ అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయాది ఇపుడు ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్.. సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లే అని ప్రకటించడంతో ఇపుడు కాళ్ళ బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ కోరింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. 
 
సింధూ జలాలు నిలిపివేస్తే పాక్‌లో తీవ్ర దుర్బిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్టు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది. అయితే, రక్తం, నీరు, రెండూ కలిసి ప్రవహించలేదంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments