Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరితో ఉన్న 15 రోజుల నవజాత శిశువును పాతిపెట్టిన కసాయి తండ్రి.. ఎక్కడ?

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (11:04 IST)
పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో హృదయివిదాకర ఘటన ఒకటి జరిగింది. ప్రాణాలతో ఉన్న 15 రోజుల నవజాత శిశువు (పాప)ను కసాయి తండ్రి ఒకడు సజీవంగా పాతిపెట్టాడు. బిడ్డ ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గోనె సంచిలో బిడ్డను ఉంచి ఆపై పాతిపెట్టినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ దంపతులకు 15 రోజుల క్రితం బిడ్డ జన్మించాడు. పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ ఆస్పత్రి ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వాటిని భరించలేని కన్నతండ్రి తయ్యబ్... చిన్నారిని ఓ గోనె సంచిలో పెట్టి పాతిపెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి.. పెళ్లికి నో చెప్పాడని అత్యాచారం కేసు పెట్టడమా? హైకోర్టు ప్రశ్న
 
స్వేచ్ఛగా దశాబ్దకాలం పాటు సహజీవనం చేసి, జీవించిన తర్వాత పెళ్ళికి నిరాకరించాడన్న ఏకైక కారణంతో పురుషుడిపై ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. పైగా, ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పదేళ్లకు పైగా స్వేచ్ఛగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని, పిటిషనర్‌పై (పురుషుడు) అత్యాచారం కేసు నమోదు చేయడం సమర్థనీయం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఉందని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు. ఈ మేరకు పిటిషనర్‌‍పై కేసు కొట్టివేయాలంటూ జులై 2న కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 'ప్రతివాది (మహిళ) ఫిర్యాదు, ఐపీసీలోని సీఆర్పీసీ 164 కింద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 375 కింద దీనిని రేప్ కేసుగా పరిగణించలేము అనేది నా అభిప్రాయం. ఈ కేసు విచారణ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తోంది' అని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు.
 
స్త్రీ, పురుషుడు ఇద్దరూ బాగా చదువుకున్న వ్యక్తులు అని, ఏకాభిప్రాయంతో ఇద్దరూ 10 ఏళ్లకుపైగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని తేలిందని కోర్టు వెల్లడించింది. ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోబోనని నిరాకరించడంతో ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని, పురుషుడిపై అత్యాచారం కేసు నమోదు చేయడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
స్త్రీని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ కూడా పురుషుడిపై కేసు పెట్టలేమని (ఐపీసీ సెక్షన్ 366) కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి పురుషుడిపై ఆ తర్వాతి కాలంలో ఐపీసీ సెక్షన్ 366 కింద పెట్టిన కేసును కూడా రద్దు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
 
కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 2021లో ఈ కేసు నమోదైంది. అత్యాచారం, ఇతర అభియోగాల కింద వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. అయితే తనపై కేసులు అక్రమమని, తనకు ఉపశమనం కల్పించాలంటూ పురుషుడు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments