Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క తోక వంకర.. మళ్లీ కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం.. గ్రామాలు ఖాళీ..

కుక్క తోక వంకర అన్న చందంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది. హిరాన

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:00 IST)
కుక్క తోక వంకర అన్న చందంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది. హిరానగర్, కెరి, మెందార్, పూంచ్ సెక్టార్‌ల వద్ద పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. 
 
నానాటికి కాల్పుల తీవ్రత పెరిగిపోవడంతో సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇంకా సరిహద్దు ప్రాంతాల్లో ఇక నివాసం తగదని.. ఇళ్లు ఖాళీ చేసి, బంకర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అయితే పాక్ రేంజర్ల దాడులను భారత జవాన్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు. కాగా, పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి 50 సార్లు తూట్లు పొడిచి, కాల్పులకు తెగబడిందని సైనికాధికారులు వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే) నుంచి జ‌మ్ముక‌శ్మీర్‌లోని తంగ్‌ధ‌ర్ సెక్టార్‌లోకి చొర‌బ‌డ‌డానికి పయత్నించిన ఉగ్రవాదులకు భారత జవాన్లు చుక్కలు చూపించారు. ఈ క్ర‌మంలో ఉగ్ర‌వాదుల‌కు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా.. మరో జవానుకు తీవ్రగాయాలయ్యాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments