Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామాలపై జగన్‌ మాతో చర్చించలేదు.. అయినా సిద్ధం: మేకపాటి

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఎంపీల రాజీనామాల అంశంపై ఆ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న జ

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (08:43 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఎంపీల రాజీనామాల అంశంపై ఆ పార్టీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న జగన్‌.. ఈ అంశంపై తమతో చర్చించలేదని వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ విభాజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి తమ రాజీనామాల వల్లే ప్రత్యేక హోదా వస్తుందని భావిస్తే ఈ క్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రత్యేక హోదాకు ఏదీ ప్రత్యామ్నాయం కాదని, ఎంత ఆర్థిక సాయం చేసినా దానివల్ల ఒరిగేదేమీ లేదన్నారు. 
 
రాజీనామాల విషయంలో పార్టీ అధినేత ఎలా చెబితే అలా నడవాల్సిందే. అయితే ఈ విషయమై ఆయన మాతో చర్చించలేదు. హోదా కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమే. రాజీనామాలు అవసరమైతే అధినేత సూచనలు పాటిస్తాం. పార్లమెంటులో హోదాపై చర్చించి గట్టిగా మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం సాగిస్తాం. మోడీ అనుకుంటే ఏపీకి హోదా వస్తుంది. బీజేపీ, టీడీపీ మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన సంగతి మరచిపోతే ఎలా? చంద్రబాబు, వెంకయ్య కేంద్రాన్ని గట్టిగా అడిగితే హోదా వస్తుంది’ అని మేకపాటి గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments