Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఉత్తర కొరియాగా పాకిస్థాన్.. భారీగా అణ్వాయుధాల తయారీ?

పాకిస్థాన్‌ మరో ఉత్తర కొరియా కానుందా? అణ్వాయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందా? ఆసియాలో మరోసారి అణుపోటీకి తెరతీస్తోందా? ఉత్తర కొరియా, చైనాలను పాకిస్థాన్‌కు సహకారం అందిస్తున్నాయా? అంటే అవుననే

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (09:47 IST)
పాకిస్థాన్‌ మరో ఉత్తర కొరియా కానుందా? అణ్వాయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందా? ఆసియాలో మరోసారి అణుపోటీకి తెరతీస్తోందా? ఉత్తర కొరియా, చైనాలను పాకిస్థాన్‌కు సహకారం అందిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు అమెరికా రక్షణ రంగ నిపుణులు. 
 
ఆసియాలో మరోసారి అణ్వాయుధ పోటీకి పాకిస్తాన్‌ తెరతీస్తోందని వారు ప్రకటించారు. ఒకేసారి తొమ్మిది కేంద్రాల్లో పాకిస్థాన్‌ అణ్వాయుధాల తయారీ చేస్తోందని అమెరికన్‌ సైంటిస్టులు వెల్లడించారు. ఇప్పటికే ఉగ్రవాదులకు స్థావరంగా మారిన పాకిస్థాన్.. మరిన్ని న్యూక్లియర్‌ వెపన్స్‌ రూపొందిస్తే పరిస్థితులు భయానకంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్టులు అంచనా ప్రకారం.. పాకిస్థాన్‌ 130-140 న్యూక్లియర్‌ వార్‌హెడ్లను రూపొందించే పనిలో పడింది. వీటిని వీలైనంత త్వరగా తయారు చేసి.. సైన్యానికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
 
పాకిస్థాన్‌ అణ్వాయుధాలను మొత్తం తొమ్మది కేంద్రాల్లో తయారు చేస్తోందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో పంజాబ్‌ ప్రావిన్స్‌లో 4, సింధ్‌ ప్రావిన్స్‌లో 3, బలూచిస్తాన్‌లో 2 కేంద్రాల్లో ఆయుధాలు రూపొందుతున్నాయని ఎఫ్‌ఏఎస్‌ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

రెండోసారి తల్లి కాబోతోన్న ఇలియానా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments