Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దెబ్బకు పాకిస్థాన్ కకావికలం.. దక్షిణాసియా దేశాల్లోనే అధికం

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (16:42 IST)
కరోనా దెబ్బకు దాయాది దేశం పాకిస్థాన్ కకావికలమైపోతోంది. దక్షిణాసియా దేశాల్లోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదైన దేశంగా పాకిస్థాన్ నిలిచింది. ఇప్పటికే 1600 కరోనా కేసులు నమోదు కాగా.. 17 మందికిపైగా మరణించినట్టు సమాచారం.
 
మరోవైపు, దక్షిణాసియా దేశాల్లోకెల్లా పాకిస్థాన్‌లో కరోనా వేగంగా వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దక్షిణాసియా దేశాలన్నింటిలో పాక్‌లోనే ఎక్కువ కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. 
 
దేశంలో ఇంత విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశం మొత్తం లాక్‌డౌన్ విధించలేదు. పాక్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే లాక్‌డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా, పాకిస్థాన్‌లోని అనేక ప్రావిన్స్ ల ప్రభుత్వాలు అక్కడి వాస్తవాలను కప్పిపుచ్చుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఏది ఏమైనా కరోనా వైరస్ దెబ్బకు పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
 
కరోనాకు పాక్ ఆటగాడు మృతి
మరోవైపు, పాకిస్థాన్ స్క్వాష్ ఆటగాడు అజం ఖాన్ కరోనా వైరస్ సోకి లండన్‌లో మృతి చెందాడు. ఈయన గత 1959, 1961 సంవత్సరాల్లో బ్రిటిష్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈయన ప్రఖ్యాత స్క్వాష్ ఆటగాడు అషీంఖాన్ సోదరుడు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments