భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (12:37 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కన్నెర్రజేసింది. ఇందులోభాగంగా, అనేక రకాలైన ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఊహించని విధంగా షాక్ కొట్టినట్టయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్థాన్‌కు వెళ్లే జలాలు ఆగిపోయాయి. ఫలితంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ కష్టాలు ఈ యేడాది రబీ సీజన్ నుంచే మొదలుకానున్నాయి. ఇప్పటికే పలు పాకిస్థాన్ కాలువలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. 
 
ఈ ఒప్పందం రద్దుతో ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (ఐఎస్ఆర్ఏ) అంచనా ప్రకారం... సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ప్రభావం పాకిస్థాన్‌కు వెళ్ళే నీటిలో 21 శాతం మేరకు కోతపడొచ్చని పేర్కొంది. ముఖ్యంగా చినాబ్ నదిలో నీటి లభ్యతలో తగ్గుదలే దీనికి కారణం అవుతుందని తేల్చింది. ఇప్పటికే సలాల, బిగ్ లిహార్ డ్యామ్ గేట్లు మూసివేయడంతో పాక్‌కు వెళ్లేనీరు చాలా వరకుతగ్గింది. 
 
మరాల వద్ద నీటి కొరత దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఖరీఫ్ సీజన్‌పై పడనుంది. ఇలాంటి చర్యలే కిషన్ గంగాపై కూడా భారత్ భావిస్తోంది. మే నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్ సీజన్‌కు నీటి లభ్యతను అంచనా వేయడానికి ఐఎస్ఆర్ఏ సమావేశమైంది. ఇందులో పలు అంశాలపై చర్చించి ఓ అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments