Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

Advertiesment
ramdev baba

ఠాగూర్

, సోమవారం, 5 మే 2025 (15:10 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమంటూ జరిగితే కేవలం నాలుగు రోజుల్లోనే దాయాది దేశం పాకిస్థాన్ నామరూపాలు లేకుండా పోతుందని, ఆ తర్వాత కరాచీలో తాము గురుకులాలను స్థాపించాల్సి వస్తుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా జోస్యం చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనివుంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ తీవ్ర అంతర్గత సమస్యలతో సతమతమవుతోందని. తనంతట తానుగానే విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి చేరుకుందన్నారు. పాకిస్థాన్ ఇప్పటికే అంతర్గత పోరాటలతో కొట్టుమిట్టాడుతోంది. బలూచిస్థాన్ ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. 
 
పాకిస్థాన్ సైనిక సామర్థ్యంపై ఆయన మాట్లాడుతూ, పాక్‌కు యుద్ధం చేసే శక్తి లేదు. ఒకవేళ భారత్‌తో యుద్ధం సంభవిస్తే ఆ దేశం నాలుగు రోజులు కూడా నిలబడలేదు అని జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో మనం కరాచీ, లాహోర్‌లలో గురుకులాలు నిర్మించాల్సిన అవసరం వస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. 
 
అలాగే, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ ఇంకా పూర్తి స్థాయిలో స్పందించలేదన్నారు. ఒకవేళ అలా చేస్తే ఉగ్రవాదులతో పాటు వారిని ప్రోత్సహించే వారు కూడా మిగలరని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాన భండారీ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)