Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో ఐఎస్ఐ పర్యటన : పాక్ చేతిలో కీలుబొమ్మగా తాలిబన్లు

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:33 IST)
ఆప్ఘనిస్థాన్‌ తాలిబన్లు కీలుబొమ్మగా మారారు. ఇప్పటికే పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ ఫయీజ్‌ అహ్మద్‌ కాబూల్‌లో పర్యటించారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు తాము చెప్పినట్టు నడుచుకునే విధంగా పాక్‌ ఐఎస్‌ఐ ట్రయినింగ్‌ ఇస్తోంది. 
 
ఐఎస్‌ఐ చీఫ్‌ జనరల్ ఫయీజ్ హమీద్ అకస్మాత్తుగా కాబూల్‌లో పర్యటించారు. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు పంజ్‌షేర్‌ వ్యాలీలో యుద్దాన్ని సమీక్షించేందుకు కాబూల్‌కు ఫయీజ్‌ అహ్మద్‌ వచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పంజ్‌షేర్‌ లోయ మినహా మిగతా ప్రాంతమంతా తాలిబన్ల కబ్జాలో ఉంది. 
 
అంతేకాదు, పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు పాకిస్థాన్‌ అన్నివిధాలా సాయం చేస్తోంది. అల్‌ఖైదా ఉగ్రవాదులతో పాటు పాక్‌ సైనికులు కూడా తాలిబన్ల తరపున పోరాటం చేస్తునట్టు తెలుస్తోంది.
 
మరోవైపు, తాలిబన్ల ప్రభుత్వంలో ఎవరు ఏ పదవి చేపట్టాలన్న విషయంపై కూడా నిర్ణయించేది పాక్‌ ఐఎస్‌ఐ అని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు. పంజ్‌షీర్ లోయలో తాలిబన్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నారు.
 
ఆందోళన చేస్తున్న మహిళలు వెనక్కి వెళ్లిపోవాలని తాలిబన్‌ నేతలు హెచ్చరించారు. అయితే వాళ్ల బెదిరింపులకు డేర్‌ డెవిల్ లేడీస్‌ భయపడలేదు. తాలిబన్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. తాలిబన్ లీడర్‌ చేతి నుంచి మైక్‌ లాక్కొని వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments