Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయ్.. బలూచిస్తాన్ వెనకబడిపోయింది: ఉద్యమకారులు

బలూచిస్తాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ సైన్యం వైదొలగాలని బలూచీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఆగడాలను రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (12:14 IST)
బలూచిస్తాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ సైన్యం వైదొలగాలని బలూచీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఆగడాలను రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రవాస బలూచీలు లండన్ నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారికి ఆక్రమిత కాశ్మీర్ నుంచి ప్రవాసం వెళ్లినవారు కూడా తోడయ్యారు. పాక్‌ సర్కారు ఆ రెండు ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. 
 
హంతకులు ఎంతటివారైనాసరే వారిని అరెస్టు చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బలూచీ ఉద్యమకారిణి మీడియాతో మాట్లాడుతూ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి సేనలను ఉపసంహరించుకోవాలని పాక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. బలూచిస్తాన్‌లో ఉద్యమకారులను అరెస్టు చేస్తున్నారని, బాబా జాన్‌తోపాటు ఆయన అనుచరులకు 40 ఏళ్లు జైలు శిక్ష విధించారని వెల్లడించారు. పాకిస్తాన్ పాలనలో బలూచిస్తాన్ బాగా వెనుకబడిపోయిందని ఉద్యమకారులు ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments