భారత్‌పై దండయాత్ర చేసేందుకు అనుమతివ్వండి : జైషే మొహ్మద్ చీఫ్
భారత్ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుగా ప్రతీకార దాడులు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జైషే మొహ్మద్ చీప్ మసూద్ అజహార్ కోరారు. భారత సైనిక స్థావరా
భారత్ ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు వీలుగా ప్రతీకార దాడులు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జైషే మొహ్మద్ చీప్ మసూద్ అజహార్ కోరారు. భారత సైనిక స్థావరాలపై దాడులను జరిపేందుకు తమను అనుమతించాలని కోరారు.
జైషే వార పత్రిక 'అల్ కాలామ్'లో ఆయన ఓ కథనాన్ని రాశాడు. ఇందులో కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. కాశ్మీర్‌ను పూర్తిగా ఆక్రమించుకునేలా చారిత్రక అవకాశం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో ఉందని, నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే అవకాశం చేజారుతుందన్నాడు.
భారత్ జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించాలని, అందుకు కాశ్మీర్‌ను కానుకగా తెచ్చిస్తామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కొంచెం ధైర్యం చూపితే కాశ్మీర్ సమస్య, నీటి వివాదాలు తొలగిపోతాయని, ముజాహిద్దీన్లకు దారివ్వాలని, ఆపై ఏం జరుగుతుందన్నది దేవుడి దయగా మసూద్ అజర్ వ్యాఖ్యానించినట్టు పత్రిక తెలిపింది.