Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టీస్.. ఎందుకు?

పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టీస్ నాసీరుల్ ముల్క్ నియమితులయ్యారు. ఆయన గురువారం తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే, పాకిస్థాన్‌కు తాత్కాలిక ప్రధానమంత్రి ఏంటి అనే కదా మీ సందేహ

Webdunia
సోమవారం, 28 మే 2018 (16:13 IST)
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టీస్ నాసీరుల్ ముల్క్ నియమితులయ్యారు. ఆయన గురువారం తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే, పాకిస్థాన్‌కు తాత్కాలిక ప్రధానమంత్రి ఏంటి అనే కదా మీ సందేహం.
 
పాకిస్థాన్‌లో ప్రస్తుతం కొలువైవున్న ప్రభుత్వం పదవీకాలం ఈ గురువారంతో ముగియనుంది. దీంతో ప్రస్తుత ప్రధాని షాహిద్ ఖకన్ అబ్బాసీ దిగిపోవాల్సి వుంది. ఈ కారణంగా ఆ దేశానికి తాత్కాలిక ప్రధానిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే, జులై 25న జరగబోయే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తాత్కాలిక ప్రధాని విషయంలో కొన్ని వారాలుగా అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్, ప్రతిపక్ష పాకిస్థాన పీపుల్స్ పార్టీ మధ్య వాదనలు జరిగాయి. 
 
చివరకు మాజీ జస్టీస్ నాసీరుల్ ముల్క్ పేరును ఖరారు చేశారు. ముల్క్ పేరును వ్యతిరేకించే వాళ్లు ఎవరూ ఉండరనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, ఈయన పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి గతంలో తాత్కాలిక చీఫ్‌గా కూడా వ్యవహరించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం తాత్కాలిక ప్రధానికి ఉండదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments