Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ఎన్నికల్లో గెలుపొందిన హిందువు... ఎలక్షన్ ఫైనల్ రిజల్ట్స్

తాజాగా పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓ హిందువు తొలిసారి విజయభేరీ మోగించారు. ఈయన జనరల్‌ కేటగిరీలో విజయం సాధించి రికార్డు సృష్టించాడు. ఆయన పేరు మహేశ్‌ కుమార్‌ మలానీ. థార్‌పార్కర్‌ నియోజ

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (12:17 IST)
తాజాగా పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓ హిందువు తొలిసారి విజయభేరీ మోగించారు. ఈయన జనరల్‌ కేటగిరీలో విజయం సాధించి రికార్డు సృష్టించాడు. ఆయన పేరు మహేశ్‌ కుమార్‌ మలానీ. థార్‌పార్కర్‌ నియోజకవర్గం నుంచి పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) తరపున మహేశ్‌ బరిలోకి దిగారు.
 
ఈయన సమీప అభ్యర్థి గ్రాండ్‌ డెమొక్రటికల్‌ అలియన్స్‌కు చెందిన అరబ్‌ జాకవుల్లాపై గెలుపొందారు. మహేశ్‌ మలాని పాకిస్థానీ హిందూ రాజస్థానీ పుష్కర్ణ బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. 2003లో పీపీపీ నుంచి పార్లమెంటు రిజర్వ్‌డ్‌ సీటుకు నామినేట్‌ అయ్యారు. 2013లో సింధ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. 
 
కాగా, పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. తుది ఫలితాలు వెల్లడైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ పార్టీ 119 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
ఇక నవాజ్ షరీఫ్ పార్టీ... పీఎంఎల్ -ఎన్‌ 63  స్థానాలు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 38, ఇతరులు 50 స్థానాల్లో గెలుపొందారు. మేజిక్ ఫిగర్ 137 స్థానాలు కావడంతో స్వతంత్రులు కీలకం కానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకన్న పీటీఐ పార్టీ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments