Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్‌ షరీఫ్‌‌కు కొత్త చిక్కులు.. కుటుంబ సభ్యులపై కేసులు.. ఎందుకు?

పనామా కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని పదవిని కోల్పోయారు. తాజాగా షరీఫ్ ఫ్యామిలీ మరిన్ని చిక్కుల్లో పడింది. పాకిస్థాన్‌కు చెందిన నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో-ఎన్‌ఏబీ మరో నాలుగు అవినీ

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (11:06 IST)
పనామా కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని పదవిని కోల్పోయారు. తాజాగా షరీఫ్ ఫ్యామిలీ మరిన్ని చిక్కుల్లో పడింది. పాకిస్థాన్‌కు చెందిన నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో-ఎన్‌ఏబీ మరో నాలుగు అవినీతి ఆరోపణ కేసులను షరీఫ్‌పై పెట్టింది. 
 
ఈ కేసుకు సంబంధించిన మిగిలిన అవినీతి ఆరోపణలను కూడా షరీఫ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని జూలై 18 నాటి తీర్పు సమయంలో సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఈ కేసులు నమోదైనాయి. ఆ కేసులు నవాజ్‌ షరీఫ్‌ ఆయన కుమారులు హసన్‌, హుస్సేన్‌, కూతురు మరియామ్‌, అల్లుడు మహ్మద్‌ సఫ్దార్‌, ఇష్క్‌దార్‌పై నమోదైనాయి. ఈ కేసులకు విలువైన ఆధారాలను విచారణలో భాగంగా సేకరించినట్లు తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన నవాజ్ షరీఫ్ నియోజకవర్గమైన లాహోర్ పార్లమెంటరీ స్థానానికి ఉపఎన్నిక సెప్టెంబర్ 17న నిర్వహించనున్నట్టు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. నవాజ్ షరీఫ్ పీఎంల్-ఎన్ పార్టీ నుంచి నవాజ్ సోదరుడైన షెహబాజ్ షరీప్ పోటీ చేయనుండగా, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ నుంచి డాక్టర్ యాస్మిన్ రషీద్ పోటీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments