Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (10:15 IST)
అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా గుర్తించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇది పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మరో నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సంస్థ ముసుగు సంస్థగా దీన్ని అమెరిగా గుర్తించి ఉగ్రసంస్థగా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'మా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇదే మా పరిపాలన నిబద్ధతను చెబుతోంది' అని రూబియో తెలిపారు. 
 
'ది రెసిస్టెంట్ ఫ్రంట్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT) ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటనే అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్క్ రూబియో వెల్లడించారు. భారత భద్రత దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు.
 
కాగా, అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికా బలమైన సహకారానికి మరో నిదర్శనం ఇది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. టీఆర్ఎఫ్ అనేది లష్కరే ముసుగు సంస్థ. పహల్గాంలో అనేక మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించకూడదు" అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే కథతో చంద్రహాస్ కాయిన్ చిత్రం

Manoj: మా అమ్మ, అక్క కళ్ళల్లో ఆనందం చూశాను : మంచు మనోజ్

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments