Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరిగిపడిన కొండచరియలు.. 36 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (10:51 IST)
దక్షిణ అమెరికాలో పెను విషాదం నెలకొంది. ప్రకృతి ప్రకోపం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 36 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ అమెరికాలోని పెరూలో ప్రతి యేటా ఫిబ్రవరి నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి. ఈ యేడాది కూడా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, దక్షిణ పెరూలోని క్యామనా ప్రావిన్స్‌లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ దిగువున ఉన్న గ్రామాలకు భారీ నష్టం కలుగుతోంది. పెద్ద రాళ్లు, మట్టి వంటవి పడటంతో అనేక మంది చనిపోతున్నారు. అనేక గృహాలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్న ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 
 
అలాగే, క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈ కొండ చరియలు విరిగి పడటం వల్ల దాదాపు 700కి పైగా గృహాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. బాధిత ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, ఈ స్థాయిలో కొండ చరియలు విరిగిపడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments