Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేశంలో హాలీవుడ్ చిత్రాలు వీక్షిస్తే కఠిన శిక్ష!!

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (09:39 IST)
ప్రపంచ దేశాల్లో ఉత్తర కొరియా విచిత్ర దేశంగా ఉంది. దీనికి కారణం ఆదేశాధినేత కిమ్ జాంగ్ ఉన్. ఆయన ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో వైరస్ సోకిన ప్రతి ఒక్కరినీ చంపేసినట్టు వార్తలు వచ్చాయి. అలాగే, ఆయన తీసుకునే నిర్ణయాలు, పరిపాలనా విధానం పిచ్చి తుగ్లక్‌ను తలపిస్తుందనే ఆరోపణలు లేకపోలేదు. 
 
తాజాగా ఆయన తీసుకున్న మరో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ చిత్రాలు వీక్షించే వారికి కఠిన శిక్షలు విధిస్తామంటూ హెచ్చరించారు. గతంలో పొరుగున ఉన్న దక్షిణ కొరియా సినిమాలు, టీవీ షోలు చూస్తే ఉత్తర కొరియాలో మరణ శిక్షలు కూడా విధిస్తారు. ఇపుడు దీన్ని హాలీవుడ్ చిత్రాలకు కూడా వర్తింపజేశారు.
 
తమ పిల్లలను హాలీవుడ్ చిత్రాలు వీక్షించేందుకు అనుమతినిచ్చే తల్లిదండ్రులకు ఈ శిక్షలను అమలు చేయనున్నారు. పిల్లలు పాశ్చాత్య దేశాల సినిమాలు, టీవీ కంటెంట్ చూస్తూ దొరికిపోతే వారి తల్లిదండ్రులు లేబర్ క్యాంపులకు పంపుతామని హెచ్చరించారు.
 
పెద్దలు ఆర్నెల్ల పాటు లేబర్ క్యాంపులో ఉండాలని, పిల్లలకు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. పిల్లలకు చదువు తప్ప మరో ధ్యాస ఉండరాదని లేకపోతే వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమైపోతారని కిమ్ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రచారం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments