Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామంటే... మాక్ డ్రిల్ నిర్వహించిన అమెరికా

ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామనే అంశంపై ఆమెరికా మాక్ డ్రిల్ నిర్వహించింది. తమ జోలికి వస్తే అణు బాంబు ప్రయోగిస్తామంటూ అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరిస్తూ.. రాత్రుళ్లు నిద్రలేకుండా చేస్తోంది. ఒక వేళ ఉత

Webdunia
బుధవారం, 31 మే 2017 (13:11 IST)
ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామనే అంశంపై ఆమెరికా మాక్ డ్రిల్ నిర్వహించింది. తమ జోలికి వస్తే అణు బాంబు ప్రయోగిస్తామంటూ అమెరికాను ఉత్తర కొరియా హెచ్చరిస్తూ.. రాత్రుళ్లు నిద్రలేకుండా చేస్తోంది. ఒక వేళ ఉత్తర కొరియా బెదిరించినట్టుగా అణుదాడి చేస్తే ఆ దాడిని తిప్పికొట్టడమే కాకుండా, ఉత్తర కొరియాను ఎలా నాశనం చేస్తామో మాక్ డ్రిల్ ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించింది. 
 
ఉత్తర కొరియా వద్ద ఉన్న ఖండాంతర క్షిపణులతో పోలిస్తే, మరింత శక్తిమంతమైన క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంపై ప్రయోగించి, దాన్ని ఆకాశంలోనే తుత్తునియలు చేసే పరీక్షలో విజయవంతమైంది. గ్రౌండ్ ఆధారిత మిడ్-కోర్స్ డిఫెన్స్ సిస్టమ్‌ను వాడుతూ, ఐదు అడుగుల పొడవైన 'కిల్ వెహికిల్'ను ప్రయోగించి, ఐసీబీఎం (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్)ను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 
 
ఈ మాక్ టెస్టును మార్షల్ దీవుల్లోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్ నుంచి ప్రయోగించామని, దాన్ని అడ్డుకునే కిల్ వెహికిల్‌ను కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ స్టేషన్ నుంచి ప్రయోగించామని తెలిపారు. కాగా, ఈ పరీక్ష మంగళవారం ఉదయం జరిపామని, తమ సత్తా ఏంటన్న విషయాన్ని నార్త్ కొరియాకు గుర్తు చేసేందుకే ఇలా చేశామని నేవీ కెప్టెన్, పెంటగాన్ అధికార ప్రతినిధి జెఫ్ డేవిస్ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments