Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ జాంగ్ ఉన్‌ హత్యకు అమెరికా, దక్షిణ కొరియా కుట్ర- జీవరసాయన ఆయుధాలతో?

జీవరసాయన ఆయుధాలతో తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), దక్షిణ కొరియా నిఘా వర్గాలు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉత్తర కొరియా అంతర్గత భద్రత

Webdunia
శనివారం, 6 మే 2017 (14:35 IST)
జీవరసాయన ఆయుధాలతో తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), దక్షిణ కొరియా నిఘా వర్గాలు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉత్తర కొరియా అంతర్గత భద్రత శాఖ వెల్లడించింది.
 
తమ అధినేత హత్యకు ఉత్తర కొరియాకే చెందిన కిమ్ అనే వ్యక్తిని అమెరికా, దక్షిణ కొరియాలు ఎంపిక చేసినట్లు దేశ అధికార వార్తా సంస్థ కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తండ్రి, తాతల సమాధులతో పాటు సైనిక పరేడ్‌లో దాడికి ప్రణాళిక రచించారని అంతర్గత భద్రత శాఖ తెలిపింది. 
 
అంతేగాకుండా కిమ్ అనే నిందితుడి దాడిని అడ్డుకోవడంతో పాటు నిందితుడి నుంచి రూ. 7.40 లక్షల అమెరికన్ డాలర్లతో పాటు ఓ శాటిలైట్‌ ట్రాన్స్‌రిసీవర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. తమవద్ద ఉన్న రేడియోధార్మిక విష పదార్థాలు ప్రయోగించిన 6 నుంచి 12 నెలల తర్వాతే ప్రభావం చూపిస్తాయని నిందితుడికి సీఐఏతో తెలిపినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments