Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త ఫ్యాంట్లు కావాలని ఆమె కోరుతోంది.. వారిద్దరికీ ఆ లింకు ఉన్నట్టే కదా!

నైజీరియాకు చెందిన ఓ మహిళకు తన స్నేహితురాలి నుంచే సవతి పోరు ఎదురైంది. ప్రతి రోజూ ఇంటికి వచ్చే స్నేహితురాలి.. ఈ మహిళ భర్తపై కన్నుపడింది.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (10:21 IST)
నైజీరియాకు చెందిన ఓ మహిళకు తన స్నేహితురాలి నుంచే సవతి పోరు ఎదురైంది. ప్రతి రోజూ ఇంటికి వచ్చే స్నేహితురాలి.. ఈ మహిళ భర్తపై కన్నుపడింది. దీంతో ప్రతిరోజూ ఇంటికి వచ్చి తన భర్త ప్యాంట్లు కావాలని కోరుతోంది. వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉండటం వల్లే ఈ విధంగా అడుగుతోంది. అందువల్ల తన భర్త నుంచి విడాకులు విప్పించాలని ఆ మహిళ కోర్టుకెక్కింది. కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తైవో(42)కు 18 ఏళ్ల క్రితం ఒలాజిడే అనే వ్యక్తితో వివాహమైంది. చాలాకాలం పాటు వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. ఇటీవల తన స్నేహితురాలు తన భర్తకు ఫోన్‌లో పంపిన వాట్సాప్ మెసేజ్ చూసిన తైవో తట్టుకోలేకపోయింది. తన ప్యాంటులు తనకు ఇచ్చేయాల్సిందిగా కోరుతూ ఆమె ఒలాజిడేకు మెసేజ్ పంపింది. దీనిని చూసిన తైవో మనసు కీడు శంకించింది. వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని భావించిన ఆమె ఈ విషయం గురించి తేల్చుకునేందుకు స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. గట్టిగా నిలదీసింది.
 
దీనికి స్పందించిన ఆమె ఈ వ్యవహారానికి ఇప్పటితో పుల్‌స్టాప్ పెడతానని మాటిచ్చింది. ఈ విషయం తెలిసిన తైవో భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. చంపేస్తానని బెదిరించసాగాడు. ఓసారి అన్నంత పనీ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భర్త నుంచి విడిపోయేందుకు విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. అంతేకాదు తాను వండిన ఆహారాన్ని గత మూడేళ్లుగా భర్త ముట్టుకోవడం లేదని తన పిటిషన్‌లో పేర్కొంది. భర్తకు తనమీద ప్రేమ లేదని, ఈ హింసను తాను భరించలేనని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును వేడుకుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments