Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైజర్ వ్యాక్సిన్‌తో న్యూజిలాండ్‌లో మహిళ మృతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (14:23 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మొన్నటి వరకు కేసులు తగ్గినప్పటికి తాజాగా పలుదేశాల్లో కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది. 
 
ఇక ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. 
 
కొన్ని చోట్ల వ్యాక్సిన్లు వికటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మరణించడం ఆందోళన రేపుతోంది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది.
 
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ (గుండె కండరాల్లో ఇన్‌ఫ్లేమేషన్‌) వల్ల ఆ మహిళ మరణించినట్లు తాము భావిస్తున్నట్లు చెప్పారు. 
 
పైజర్ వ్యాక్సిన్ వల్ల న్యూజిలాండ్‌లో సంభవించిన తొలి మరణం ఇదేనని చెప్పింది. ఆ మహిళ వయస్సు మాత్రం చెప్పలేదు. ఆ మహిళ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments