Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విషమంగా న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిన్స్

విషమంగా న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిన్స్
, శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:19 IST)
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ (51) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కెయిన్స్‌కు శుక్రవారం సిడ్నీలో గుండెకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే శస్త్రచికిత్స జరుగుతుండగానే కెయిన్స్ పక్షవాతానికి గురయ్యారు. ఆయన కాళ్లు అచేతనంగా మారిపోయాయి.
 
ఆపరేషన్ సందర్భంగా కెయిన్స్ వెన్నెముకలో స్ట్రోక్ వచ్చిందని, దాంతో కాళ్లు చచ్చుపడ్డాయని ఆయన లాయర్ ఆరోన్ లాయిడ్ వెల్లడించారు. కెయిన్స్ ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న కాన్ బెర్రాకు తిరిగొచ్చేశాడని, వెన్నెముక నిపుణుల సమక్షంలో ఆయనకు మరింత చికిత్స అవసరమని తెలిపారు.
 
కాగా, కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి విషమించడం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కెయిన్స్ త్వరగా కోలుకోవాలని అభిలషించారు. అలాగే, మరికొందరు మాజీ క్రికెటర్లు కూడా కెయిన్స్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కాగా, క్రిస్ కెయిన్స్ మొత్తం 62 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 3320 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 22 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక స్కోరు 158 పరుగులు. అలాగే, 215 వన్డే మ్యాచ్‌లు ఆడిన కెయిన్స్... 4950 రన్స్ చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 115 రన్స్ చేశాడు. నాలుగు సెంచరీలు, 26 అర్థ సెంచరీలు ఉన్నాయి. 14 టీ20లు ఆడిన కెయిన్స్ 50 పరుగుల అత్యధిక పరుగులతో మొత్తం 176 రన్స్ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్ ఫ్యాన్స్ విసిగించినా.. కౌంటరటాక్ చేసిన సిరాజ్.. నవ్వుకున్న..?