Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్ ఫ్యాన్స్ విసిగించినా.. కౌంటరటాక్ చేసిన సిరాజ్.. నవ్వుకున్న..?

Advertiesment
ఇంగ్లండ్ ఫ్యాన్స్ విసిగించినా.. కౌంటరటాక్ చేసిన సిరాజ్.. నవ్వుకున్న..?
, గురువారం, 26 ఆగస్టు 2021 (23:49 IST)
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. 78 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత ఇంగ్లాంగ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది.
 
అయితే టీమ్ ఇండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత క్రికెటర్లను పదే పదే రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. తొలి రెండు టెస్టుల్లో టీమ్ ఇండియాతో పై చేయి అయ్యింది. దీంతో గ్యాలరీల్లో సైలెంట్‌గా కూర్చున్న ఇంగ్లాండ్ అభిమానులు.. మూడో టెస్టు తొలి రోజు మాత్రం రెచ్చిపోయారు. 
 
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌పై బాటిల్ విసిరారు. అయితే ఆ బాటిల్ సిరాజ్‌కు తగలలేదు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటిల్ పడటం గమనించాడు. 
 
వెంటనే ఆ బాటిల్ తిరిగి వారివైపే విసిరెయ్ అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో సిరాజ్ ఆ బాటిల్‌ను తీసి గ్యాలరీ వైపు విసిరాడు. అయినా సరే ఇంగ్లాండ్ అభిమానులు తమ అత్యత్సాహాన్ని ఆపలేదు. తమ చేష్టలతో మహ్మద్ సిరాజ్‌ను విసిగించడం మొదలు పెట్టారు.
 
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ అయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్కోరెంత? అని అడిగారు. మహ్మద్ సిరాజ్ మామూలుగానే హైదారబాదీ స్టైల్‌లో పంచ్‌లు విసురుతుంటాడు. 
 
వాళ్లు అడిగిన ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చి 1-0 అంటూ చేతులతో సైగలు చేసి చూపించాడు. అంటే సిరీస్‌లో మీరు ఇంకా గెలవలేదు.. మేము 1-0తో ఆధిపత్యంలో ఉన్నాము అంటూ సిరాజ్ సైగలు చేశాడు. 
 
టీవీ ప్రత్యక్ష ప్రసారంలో సిరాజ్ చూపించిన సైగలు కనిపించాయి. కామెంటేటర్లు కూడా సిరాజ్ సైగలకు నవ్వుకున్నారు. తనను ఇంగ్లాండ్ అభిమానులు పంచ్‌లతో విసిగిస్తుంటే.. వాళ్లకే రివర్స్ పంచ్ ఇచ్చి షభాష్ అని అనిపించుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ వెంటనే సచిన్‌కు ఫోన్ చేసి మాట్లాడు.. ఆయన సాయం తీసుకో?