Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంపం వచ్చినా ఆగని కివీస్ ప్రధాని ఇంటర్వ్యూ...

Webdunia
సోమవారం, 25 మే 2020 (13:56 IST)
సాధారణంగా భూమి కంపిస్తుందంటే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. కానీ, న్యూజిలాండ్ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మాత్రం... టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. అయినప్పటికీ ఆమె ప్రాణభయంతో ఇంటర్వ్యూను మధ్యలో ఆపేసి పారిపోలేదు. పైగా, తన ఇంటర్వ్యూను కంటిన్యూ చేశారు. భూప్రకంపనలకు భయపడేందుకు తానేమీ వేలాడే లైట్ల కిందలేను అని చెప్పుకొచ్చారు. 
 
కివీస్ ప్రధాని వెల్లింగ్ట‌న్‌లోని పార్ల‌మెంట్ భవనం నుంచి 'ద ఏఎం' షోకు ఇంట‌ర్వ్యూ ఇస్తున్న సమయంలో భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. భూకంప తీవ్ర‌త 5.8గా న‌మోదు అయ్యింది. లైవ్ ఇంట‌ర్వ్యూ ఇస్తూనే.. భూమి ఊగిపోతోందని ప్రధాని అన్నారు. 
 
టీవీ హోస్ట్ ర్యాన్ బ్రిడ్జ్‌.. కాసేపు ప్ర‌ధాని మాట‌లు విని.. మీరు ఓకేనా.. భూకంపం ఆగిందా? అని అడిగారు. అప్పుడు ప్ర‌ధాని జెసిండా షో కంటిన్యూ చేసేందుకు అంగీక‌రిస్తూ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. చాలా స్వ‌ల్ప భూకంపం వ‌చ్చిన‌ట్లు ఉంద‌ని, చాలా డీసెంట్ ప్ర‌కంన‌లు వ‌చ్చిన‌ట్లు లైవ్ షోలోనే ప్ర‌ధాని జెసిండా తెలిపారు. 
 
వెల్లింగ్ట‌న్‌కు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న లెవిన్ ప‌ట్ట‌ణంలో భూకంప కేంద్ర న‌మోదైంది. లైవ్ షోలో చిన్న చిరున‌వ్వు ఇస్తూనే.. ఇక్క‌డ స్వ‌ల్ప భూకంపం న‌మోదు అయిన‌ట్లు జెసిండా తెలిపారు. ఇంట‌ర్వ్యూ కొన‌సాగించేందుకు త‌న‌కు ఇబ్బంది లేద‌ని, తానేమీ వేలాడే లైట్ల కింద లేను అని, చాలా బ‌ల‌మైన నిర్మాణం కింద ఉన్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments