Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధానమంత్రి ప్రకటన: స్టాక్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది

ప్రధానమంత్రి ప్రకటన: స్టాక్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది
, బుధవారం, 13 మే 2020 (18:24 IST)
"ప్రధానమంత్రి రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అనేది ఖచ్చితంగా సరైన దిశలో స్వాగతించే ముందడుగు, ఇది కొంతకాలంగా ఎదురుచూడబడుతోంది. మార్కెట్లు బెంచిమార్క్ సూచికలతో 2.5% కంటే ఎక్కువ పెరిగాయి, ఈ ప్రకటనకు అందరి నుండి ప్రశంసలు అందుతాయి. 
 
కోవిడ్-19 తరువాత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గందరగోళంలో ఉన్నందున, ప్రజలందరికీ విశ్వాసాన్ని కలిగించడానికి పెద్ద మరియు సాహసోపేతమైన చర్యలతో ధైర్యంగా అడుగులు వేయడం ఖచ్చితంగా అవసరం. అయినప్పటికీ, ప్రభుత్వానికి ఉన్న ప్రధాన సవాలు ఏమిటంటే, ఖర్చును, ఆదాయంతో సమతుల్యం చేసుకోవడం ఎలా అనేదే. లేకపోతే మన ఆర్థిక లోటు చేయిదాటి పోవచ్చు, ఇది మన సావరిన్ రేటింగ్‌ను తగ్గించటానికి దారితీస్తుంది.
 
కానీ, అదే సమయంలో, విమానయానం, ఆతిథ్యరంగం, ప్రయాణ మరియు పర్యాటక రంగం మరియు మరెన్నో ఇలాంటి పతనానికి అంచున ఉన్న అనేక పరిశ్రమలను కాపాడటానికి సానుకూల చర్యలు అవసరం. కానీ ఆర్థిక మంత్రి నుండి వివరణాత్మక ప్రకటనల కోసం మేము వేచి ఉండాల్సి ఉంటుంది. 
 
ఇది ఆర్థిక ప్యాకేజీ యొక్క వివరాలపై వివిధ రంగాలకు ఏమి ఉంది అనే స్పష్టత ఇస్తుంది. కానీ, అంతేకాక, ఇది ప్రభుత్వం నుండి స్వాగతించదగిన అడుగు మరియు ఇది స్వావలంబన మార్గంలో భారతదేశం పురోగతికి సహాయపడుతుంది.”
 
- ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ హెడ్ అడ్వైజరీ మిస్టర్ అమర్ డియో సింగ్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌పై రాములమ్మ ఆగ్రహం, ఏమిటి సంగతి?