Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ ప్రధానికి జేజేలు.. కరోనా చివరి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాడోచ్

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (19:27 IST)
Newzealand PM
కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డ‌న్స్ అనుసరించిన విధివిధానాలు, ఆమె సమ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వమే కార‌ణ‌మైంద‌ని ప్ర‌జ‌లు ఆమెకు జేజేలు ప‌లుకుతున్నారు.

క‌రోనా ఉనికి క‌న‌బ‌డ‌గానే లాక్‌డౌన్ విధించ‌డం, ఎక్కువ సంఖ్య‌లో ప‌రీక్ష‌లు చేయ‌డం ఈ గెలుపుకు దోహ‌ద‌పడ్డాయంటున్నారు. ఆ దేశంలో ఆరు కరోనా కేసులు న‌మోద‌వ‌గానే దేశ ప్ర‌జ‌లంద‌రూ రెండు వారాల‌పాటు సెల్ఫ్ ఐసోలేట్‌లో ఉండాల‌ని ప్రధాని జెసిండా పిలుపునిచ్చారు. 
 
బాధితుల సంఖ్య 28కు చేరుకునే స‌మ‌యానికి విదేశాల నుంచి రాక‌పోక‌ల‌పై నిషేధం విధించారు. అంతేకాక దేశంలో 2,67,435 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 1504 కేసులు న‌మోద‌వ‌గా 22 మంది చ‌నిపోయారు, మిగ‌తా అంద‌రూ కోలుకున్నారు.

ఇలాంటి విష‌మ ప‌రిస్థితుల మ‌ధ్య న్యూజిలాండ్‌ దేశం శుభ‌వార్త తెలిపింది. క‌రోనా నుంచి కోలుకున్న చివ‌రి బాధితుడిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గ‌త వారం రోజులుగా ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments