Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్వాన్ లోయలో ఘర్షణ.. 60 మంది చైనా సైనికుల మృతి.. అమెరికా మీడియా

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (17:51 IST)
భారత్-చైనాల మధ్య గల్వాన్ లోయలో జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 60మంది చైనా సైనికులు మరణించారని అమెరికాకు చెందిన వార్తా పత్రిక న్యూస్‌ వీక్‌ తన సెప్టెంబర్‌ 11 నాటి సంచికలో ఈ సంచలన విషయాలను ప్రచురించింది. పీఎల్‌ఏ తోకముడుస్తుందని చైనా ఏనాడూ భావించలేదని, దుందుడుకుగా వ్యవహరించే జిన్‌పింగ్‌కు ఇది పెద్ద అపజయంగా భావించాలని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
 
న్యూస్‌ వీక్‌ పత్రిక కథనం ప్రకారం.. భారత సరిహద్దులో చైనా సైన్యం విఫలమైంది. ఈ వైఫల్యం తరువాత సైన్యంలో విధేయులను నియమించుకోవాలని చైనా సైన్యం జిన్‌పింగ్‌కు సూచించింది. అతి పెద్ద విషయం ఏమిటంటే, వైఫల్యం కారణంగా పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్, పిఎల్‌ఏ నాయకుడు కూడా అయిన జిన్‌పింగ్.. భారత సైనికులపై వీలైనంత త్వరగా మరో దూకుడు చర్య తీసుకోవాలని ప్రోత్సహించారు. 
 
ఈ కథనంలో చైనాకు చెందిన ఎంత మంది సైనికులు చనిపోయింది వెల్లడించేందుకు చైనా ప్రభుత్వం ముందుకు రాకపోవడం వారి తప్పిదమే అని తెలిపింది. గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించారని భారత ప్రభుత్వం వెల్లడించింది. చైనా పీఎల్‌ఏ ఎందుకు వెల్లడించలేదు అని ప్రశ్నించింది. ఆనాటి ఘర్షణలో చైనాకు చెందిన దాదాపు 60 మంది మరణించారని కథనంలో వెల్లడించారు. మరెందరో గాయపడ్డారని కూడా కథనం తెలిపింది.
 
గల్వాన్‌లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ 40 ఏళ్ల తరువాత మొదటి ప్రమాదకరమైన ఘర్షణ ఇదే. ఈ ఏడాది ఆగస్టు నెల చివరలో 50 సంవత్సరాలలో మొదటిసారి భారత్‌ దూకుడు వైఖరిని ప్రదర్శించింది. చైనా స్వాధీనం చేసుకున్న అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలను భారతదేశం తిరిగి తన వశం చేసుకుంది. ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నాలను భారత జవాన్లు అడ్డుకోవడంతో చైనా సైన్యం షాక్‌కు గురైంది.
 
ఆశ్చర్యపోయిన చైనా సైనికులు వెనక్కి తిరిగి రావలసి వచ్చింది. చొరబాటుదారులకు భారత్‌ అవకాశం ఇవ్వడం లేదని న్యూస్‌ వీక్‌ తన కథనంలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments