Webdunia - Bharat's app for daily news and videos

Install App

బక్రీద్ రోజున మేకలకు బదులు మనుషుల తలలు కోసి పండగ చేసుకున్నారు...

ముస్లిం సోదరుల పవిత్ర పండగల్లో బక్రీద్ ఒకటి. ఆ రోజున ప్రతి ముస్లిం ఎంతో పవిత్రంగా ఉంటారు. కానీ, తమ ఉన్మాద చర్యలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మాత్రం మరింత రెచ్చిపోయారు. బక్రీ

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (09:27 IST)
ముస్లిం సోదరుల పవిత్ర పండగల్లో బక్రీద్ ఒకటి. ఆ రోజున ప్రతి ముస్లిం ఎంతో పవిత్రంగా ఉంటారు. కానీ, తమ ఉన్మాద చర్యలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మాత్రం మరింత రెచ్చిపోయారు. బక్రీద్ రోజున మేక తలలకు బదులు మనుషుల తలలు కోసి పండగ చేసుకున్నారు. పైగా, అత్యంత దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐసిస్ విడుదల చేసింది. 
 
తమ వద్ద ఉన్న బందీలను మేకల్లా వేలాడదీసిన ఉగ్రవాదులు వారి పీకలను పదునైన కత్తితో తెగ్గోశారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలు అమెరికా సైన్యానికి గూఢచర్యం చేస్తూ సిరియాలో పట్టుబడ్డారని చెబుతోంది. అందుకోసమే ఈ వీడియోకు 'మేకింగ్ ఆఫ్ ఇల్లుషన్' (వంచన చేయడం) అని పేరు కూడా పెట్టారు. 
 
ఐసిస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఈ వీడియోను చూసిన ప్రపంచం షాక్‌కు గురైంది. మొత్తంగా 12 నిమిషాలపాటు సాగిన ఈ వీడియోలో కొన్నిచోట్ల పారిస్‌లోని ఈఫిల్ టవర్, నీస్‌లో జరిగిన ట్రక్కు దాడి దృశ్యాలను పొందుపరిచారు. బందీల పీక కోస్తున్న ఈ వీడియోను ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఓ జంతువధశాలలో తీసినట్టు ఐసిస్ చెబుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments