Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వీధుల్లో హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం.. ట్రంప్ అనుచరుల పనేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం ఒకటి మాన్ హట్టన్‌లో దుమారం రేపింది. గతంలో

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (12:43 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం ఒకటి మాన్ హట్టన్‌లో దుమారం రేపింది. గతంలో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ నగ్నంగా ఉన్న విగ్రహాలు అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయగా ఆ విగ్రహాలను అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. 
 
ఇందులో ఓ విగ్రహాన్ని వేలం వేయడం కూడా జరిగింది. ఇదిలావుంటే ఇప్పుడు డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదస్పదంగా మారింది. న్యూయార్క్‌లోని స‌బ్‌వే స్టేష‌న్ బయట డెమోక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ టాప్‌లెస్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటుచేశారు. అయితే హిల్లరీ నగ్న విగ్రహం ఏర్పాటుపై మాత్రం అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ట్రంప్‌ నగ్న విగ్రహం పెద్ద దుమారమే రేపడంతో... అది హిల్లరీ మద్దతుదారుల పనేనని ట్రంప్‌ విమర్శించారు. ఇదిగో, ఇప్పుడు హిల్లరీ క్లింటన్‌ నగ్న విగ్రహం వెలుగు చూసింది. షరామామూలుగానే ఇది ట్రంప్‌ పనేనని హిల్లరీ విమర్శిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులిద్దరి నడుమ విమర్శల జడివాన తారాస్థాయికి చేరగా ఇప్పుడు ఈఘటనతో ప్రచారం మరింత వేడెక్కనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి సభ్యులందరికీ, కార్మికులకూ మంచి జరగాలి : మాదాలరవి

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం