మార్స్‌పై ఫస్ట్ ల్యాండింగ్ టెస్ట్ సక్సెస్.. నాసా అద్భుతం...

మార్స్ (అరుణ గ్రహం)పై తొలి ప్యారాచ్యూట్ ల్యాండింగ్ పరీక్షను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విజయవంతం చేసింది. ఈ సక్సెస్ 2020లో నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ మిషన్‌కు విజయ సూచిక

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (12:41 IST)
మార్స్ (అరుణ గ్రహం)పై తొలి ప్యారాచ్యూట్ ల్యాండింగ్ పరీక్షను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విజయవంతం చేసింది. ఈ సక్సెస్ 2020లో నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ మిషన్‌కు విజయ సూచిక కానుంది. 
 
ప్యారాచ్యూట్ ద్వారా అంగార‌క వాతావ‌ర‌ణంలోకి పే లోడ్ ప్ర‌వేశ‌పెట్ట‌డంలో విజ‌యం సాధించింది. సెక‌నుకు 5.4 కి.మీ.ల వేగంతో అంగారక వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించే పే లోడ్ వేగాన్ని ప్ర‌త్యేక వ‌స్త్రంతో త‌యారుచేసిన ప్యారాచ్యూట్ ద్వారా త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ పరీక్ష చేశారు.
 
ఈ ప్ర‌యోగానికి అడ్వాన్స్‌డ్ సూప‌ర్‌సోనిక్ ప్యారాచ్యూట్ ఇన్‌ఫ్లేష‌న్ రీసెర్చ్ ఎక్స్‌పెరిమెంట్ (ఆస్పైర్‌) అని పేరు పెట్టారు. అక్టోబ‌ర్ 4న అమెరికాలోని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంట‌ర్ నుంచి జ‌రిగిన ఈ ప్ర‌యోగంలో ముందు రాకెట్ ద్వారా మార్స్ మీద‌కి పేలోడ్‌ని పంపి, అక్క‌డ అది ల్యాండ్ అయ్యే స‌మ‌యంలో ప్యారాచ్యూట్ స్థితిగ‌తుల‌ను, మార్పుల‌ను అధ్య‌యనం చేశారు. ఆ అధ్య‌యనానికి అనుగుణంగా ప్యారాచ్యూట్ త‌యారీలో లోపాల‌ను స‌వ‌రించ‌డం వంటి మార్పులు చేస్తారు.
 
ఈ ప్ర‌యోగానికి సంబంధించిన వీడియోను నాసా జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబొరేట‌రీ త‌మ యూట్యూబ్ ఛాన‌ల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రాకెట్ ప్ర‌యోగం నుంచి పే లోడ్ ల్యాండ్ కావ‌డం, ప్యారాచ్యూట్ తెరుచుకోవ‌డం, రాకెట్ తిరిగి అట్లాంటిక్‌లో పంపడం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియోనూ మీరూ తిలకించండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments