Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ మంత్రివర్గంలో నారాయణమూర్తి అల్లుడు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు బ్రిటన్ మంత్రివర్గంలో చేరారు. ఆయనతో పాటు మరో భారతీయ సంతతికి చెందిన ఎంపీకి ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మే తన మంత్రివర్గంలో చోటుకల్పించారు.

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (18:52 IST)
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు బ్రిటన్ మంత్రివర్గంలో చేరారు. ఆయనతో పాటు మరో భారతీయ సంతతికి చెందిన ఎంపీకి ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మే తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. 
 
థెరిసా మేకు చెందిన కన్జర్వేటివ్ ప్రభుత్వం తాజాగా తన మంత్రిమండలిని విస్తరించింది. కొత్తగా మంత్రి బాధ్యతలు దక్కిన భారతీయ సంతతి వారిలో రిషి సునక్‌తో పాటు సుయెల్ల ఫెర్నాండేజ్ ఉన్నారు. ఎంపీ ఫెర్నాండేజ్ పూర్వీకులు గోవాకు చెందినవారు. అయితే భారతీయ సంతతి ఎంపీలు ఇద్దరూ బ్రిగ్జిట్‌కు అనుకూలంగా ఓటేశారు. 
 
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు సునక్ బ్రిటన్ ప్రభుత్వంలో హౌజింగ్ శాఖ మంత్రిగా చేయ‌నున్నారు. నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి 2015లో తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 మళ్లీ ఎన్నికయ్యారు. 37 ఏళ్ల రిషి సునక్.. ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తితో సునక్‌కు పరిచయమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments