Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్టుకు రాకూడదు.. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాకు.. హైకోర్టు ఆగ్రహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సి వుందని చెప్తున్న జగన్.. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహా

Advertiesment
కోర్టుకు రాకూడదు.. అందుకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సాకు.. హైకోర్టు ఆగ్రహం
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (09:50 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సి వుందని చెప్తున్న జగన్.. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన నేపథ్యంలో.. కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకే జగన్ ఇలాంటి పాదయాత్రల సాకు చెప్తున్నట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
మినహాయింపును కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం నాడు రాలేకపోతే, అందుకు కారణాలను వెల్లడిస్తూ, కింది కోర్టులోనే అనుమతి పొందవచ్చని.. అది ఆ కోర్టు విచక్షణపైనే ఆధారపడి వుంటుందని హైకోర్టు తేల్చి చెప్పేసింది. నాలుగేళ్ల తర్వాత పాదయాత్ర అనే కారణంతో పిటిషన్ సమర్పించడం వెనుక కోర్టుకు హాజరు కాకూడదనే ఆలోచన వుందేమోనని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది.  
 
నేర తీవ్రత తక్కువగా వుంటే పర్లేదు కానీ.. ఎక్కువకాలం శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఇలాంటి సౌలభ్యాలు లభించవని న్యాయమూర్తి .సత్యనారాయణమూర్తి తీర్పిచ్చారు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ తరహా కేసుల్లో నిందితులకు మినహాయింపులుండవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారులో ప్రసవించిన మహిళ.. అమినియోటిక్ శాక్‌తో పుట్టిన బిడ్డ (ఫోటో)