Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో న్యుమోనియా లక్షణాలతో అంతుచిక్కని వ్యాధి.. వివరాలు కోరిన డబ్ల్యూహెచ్ఓ

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:31 IST)
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో మరో అంతుచిక్కని వైరస్ ఒకటి వెలుగు చూసింది. ఈ వైరస్ బారినపడిన అనేక మందిచిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. ముఖ్యంగా అంతుచిక్కని న్యుమోనియా లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులు ఉండే ప్రాంతాల వివరాలను ఇవ్వాలని కోరింది. పైగా, ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
కాగా, గత 2019లో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకున్న కొవిడ్ 19 వైరస్ చైనా దేశంలోని వ్యూహాన్ నగరం నుంచి వ్యాప్తి చెందింది. ఈ మహమ్మారి మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆ దేశాన్ని మరో ప్రాణంతక జబ్బు పట్టుకుంది. పాఠశాలలకు వెళుతున్న చిన్నారుల్లో అంతుచిక్కని న్యుమోనియా లక్షణాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
'బుధవారం ఉదయం అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయి. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఈ అంతు చిక్కని న్యుమోనియా రకం వ్యాప్తి చెందకుండా పాఠశాలలను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి' అని ప్రొమెడ్ సంస్థ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. 
 
ఒకేసారి వందల మంది పిల్లలు అనారోగ్యానికి గురికావడం అసాధారణ విషయమని, ఈ జబ్బు ఎప్పుడు, ఎలా పుట్టుకొచ్చిందో స్పష్టత లేకపోయినా.. పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని పేర్కొంది. పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు వెల్లడించింది. ఇది కరోనాలాగా మరో మహమ్మారిగా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రోమెడ్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 
 
ఈ ఏడాది ప్రారంభంలో చైనా కరోనా నిబంధనలను ఎత్తివేసిందని, అప్పటి నుంచి తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రుల వద్ద చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు క్యూ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments