Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు.. బిట్ కాయిన్లలో డబ్బు కావాలంటా డెడ్‌లైన్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:13 IST)
అత్యంత రద్దీగా ఉండే దేశ వాణిజ్య రాజధాని ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టు ఫీడ్ బ్యాక్ ఇన్‌బాక్స్‌కు ఈ ఈమెయిల్‌ను అగంతకులు పంపించారు. ఇందులో తమకు బిట్ కాయిన్ రూపంలో నగదు చెల్లించాలంటూ ఇందుకోసం 48 గంటల పాటు డెడ్‌లైన్ విధిస్తున్నామని అందులో పేర్కొంది. పైగా, తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2ను పేల్చివేస్తామని ఆ అగంతకులు హెచ్చరించారు. 
 
తాము విధించిన గడువులోగా డబ్బు చెల్లించకపోతే మరో మెయిల్ పంపుతామని, ఆ తర్వాత కూడా తమ డిమాండ్ నెరవేర్చకపోతే టెర్మినల్-2ను పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈమెయిల్ బెదిరింపుపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల ఇదే తరహా బెదిరింపు వచ్చిన విషయం తెల్సిందే. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకపోతే హత్య చేస్తామంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆతర్వాత రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన 19 యేళ్ల యువకుడిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments