Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో తరగతి చిన్నారికి బలవంతంగా కోడిగుడ్డు తినిపించిన టీచర్.. తర్వాత ఏమైంది?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:05 IST)
కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఓ ఘటన జరిగింది. ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న శాఖాహార సామాజిక వర్గానికి చెందిన ఆరేళ్ల బాలికకు ఆ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు బలవంతంగా కోడిగుడ్డు తినిపించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజన పథకం కింద కోడిగుడ్డును తన కుమార్తెకు టీచరీ బలవంతంగా తినిపించాడని, దీంతో తన కుమార్తె తీవ్ర అస్వస్థతకు లోనైందని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము శాఖాహారులమని పాఠశాల యాజమాన్యానికి చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. 
 
పైగా, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కొడతామంటూ తన కుమార్తెను బెదిరించారని, తమ సామాజిక వర్గానికి చెందిన వారు గుడ్డు తింటే ఏమీ కాదని చెప్పినా టీచర్ హేళనగా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందువల్ల ఈ ఘటనకు బాధ్యులైన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, బాలిక తండ్రి చేసిన ఆరోపణలను స్కూల్ యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు కూడా కొట్టిపారేశారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments