Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో దారుణం : ప్రకాశం జిల్లాకు చెందిన తల్లీకొడులను గొంతుకోసి చంపేశారు

అమెరికాలో మరో దారుణం జరిగింది. మొన్నటికిమొన్న హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యహంకారి కాల్చి చంపాడు. ఇపుడు ప్రకాశం జిల్లాకు చెందిన తల్లీకొడుకులను గుర్తు తెలియని దండగుడు గొంతు కోసి అతి దా

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (09:44 IST)
అమెరికాలో మరో దారుణం జరిగింది. మొన్నటికిమొన్న హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యంహకారి కాల్చి చంపాడు. ఇపుడు ప్రకాశం జిల్లాకు చెందిన తల్లీకొడుకులను గుర్తు తెలియని దండగుడు గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం న్యూజెర్సీలో మ్యాపుల్‌సెట్‌లో జరిగింది. 
 
మృతులను ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హనుమంతరావు భార్య శశికళ (40), కుమారుడు అనీష్‌ సాయి(7)గా గుర్తించారు. హనుమంతరావు, శశికళకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు అమెరికాలో తొమ్మిదేళ్లుగా నివసిస్తున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. 
 
బుధవారం సాయంత్రం శశికళ బాబును స్కూల్‌ నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు విగతజీవులుగా కనిపించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంకు చెందిన తల్లీకుమారుడి హత్య | తల్లితో పాటు ఆరేళ్ల కుమారుడిని హత్య చేసిన దుండగులు | తల్లీకుమారుడి హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments