Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటిగా జీవించలేం చనిపోదామన్నాడు... విషం తాగినట్టు నమ్మించి ప్రియుడు పరార్.. ప్రేయసి మృతి

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడి మాటలు నమ్మి విషం తాగిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. విషం తాగినట్టు నటించిన ప్రియుడు మాత్రం ప్రాణాలతో బయటపడి పారిపోయాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బెల్

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (09:01 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడి మాటలు నమ్మి విషం తాగిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. విషం తాగినట్టు నటించిన ప్రియుడు మాత్రం ప్రాణాలతో బయటపడి పారిపోయాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా రాయబాగ్‌ తాలూకా కంకణవాడి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కంకణవాడి గ్రామానికి చెందిన లక్ష్మి (19), మహంతేష్ (19) అనే ఇద్దరు యువతీ యువకులు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరికొకరు జన్మించినట్లు భావించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనట్లుగా బాసలు చేసుకున్నారు. స్థానికంగా ఉండే ఓ కాలేజీతో చదువుతున్నారు. 
 
ఇంతలో లక్ష్మికి మరో యువకుడితో వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లక్ష్మి.. తన పరిస్థితిని వివరించి పెళ్లి చేసుకుందామని పట్టుబట్టింది. అయితే, పెళ్ళి చేసుకోవడం వీలుపడదని, కావాలంటే చనిపోదామని ఆ ప్రియుడు నమ్మించాడు. దీంతో వారిద్దరు కలిసి విషం సేవించారు. 
 
లక్ష్మి నిజంగానే విషాన్ని పూర్తిగా సేవించగా, మహంతేష్ మాత్రం విషం తాగినట్టు నటించాడు. దీంతో లక్ష్మి విష ప్రభావానికి లోనై ప్రాణాలు విడిచింది. అది తాగినట్లు మహంతేష్‌ నటించి.. చివరికి ఎటో వెళ్లిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments