Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు.. నమ్ముతున్న అమెరికా జనం.. గెలుస్తారా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలను జనం నమ్ముతున్నారని తాజా సర్వేలో తేలింది. మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న ఆరోపణలను ట్రంప్‌తో పాటు ఆయ

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (11:21 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలను జనం నమ్ముతున్నారని తాజా సర్వేలో తేలింది. మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న ఆరోపణలను ట్రంప్‌తో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులు ఖండిస్తున్న వేళ.. జనం మాత్రం ఆ ఆరోపణలను నిజమని నమ్ముతున్నారు. 
 
డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను అమెరికన్లు నమ్ముతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. డొనాల్డ్ ట్రంప్ పై మహిళలు చేసిన ఆరోపణలను విశ్వసిస్తున్నామని ఏపీ-జీఎఫ్‌ కే సర్వేలో 70 శాతం మందిపైగా అమెరికన్లు వెల్లడించారు. ట్రంప్ మద్దతుదారుల్లో 35 శాతం మంది ఈ ఆరోపణలను నమ్ముతుండటం విశేషం. 
 
కాగా 2005లో ఓ వివాహితతో ట్రంప్ మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు, మోడల్స్‌తో పాటు 12 మంది అతనికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం