Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్గంలో భూములు అమ్ముతానంటున్న చర్చి ఫాస్టర్..!

వరుణ్
మంగళవారం, 25 జూన్ 2024 (12:20 IST)
ఈ మధ్యకాలంలో చంద్రుడిపై రియల్ ఎస్టేట్ ఇటీవల జోరుగా సాగుతుంది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతమై విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత అక్కడి ల్యాండ్ కొని, తమకు ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్‌కు చెందిన ఓ చర్చి ఫాస్టర్ ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతానంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పించాడు. చదరపు మీటర్‌కు కేవలం వంద దాలర్లేనని చెబుతూ స్వర్గంలోని స్పెషల్ ఏరియాలో ఒక్క ప్లాట్ కొనుక్కుంటే సాక్షాత్తూ దేవుడి పక్కనే ఉండొచ్చని అంటున్నాడు. స్వర్గంలో రియల్ ఎస్టేట్ ఏంటయ్యా అనే వాళ్లకు ఇంకో షాకింగ్ విషయమూ చెప్పాడు. అదేంటంటే.. ఈ దందాకు దేవుడి అనుమతి కూడా ఉందట. 
 
2017లో దేవుడితో జరిగిన ఓ సమావేశంలో తాను ఈ రియల్ ఎస్టేట్ ప్రతిపాదనను ఆయన ముందుంచానని, దీనిని పరిశీలించి దేవుడు ఓకే చెప్పాడని అంటున్నాడు. స్వర్గంలో ప్లాట్స్ అమ్ముతున్నాం అంటూ సదరు చర్చి ఫాస్టర్ ఓ బ్రోచర్ కూడా ప్రింట్ చేసి జనాలకు పంచుతున్నాడు. అందులో మేఘాల మధ్యలో ఓ విల్లా, దానిని చేరుకునేందుకు మెట్లగుండా వెళుతున్న ఓ కుటుంబం ఫొటోను అచ్చు వేయించాడు. దేవుడి చెంతనే నివాసం ఉండే అవకాశం.. దీనికి మాది గ్యారంటీ అంటూ నగదు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు గూగుల్ పే, యాపిల్ పే వంటి యూపీఐ పేమెంట్ సదుపాయం కూడా ఉందని చెప్పాడు.
 
స్వర్గంలో భూములు అమ్ముతానని ఫాస్టర్ చెప్పడం సరే, ఆ మాటలు నమ్మేదెవరు, కొనేదెవరు అనుకుంటున్నారా.. అయితే, మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఇప్పటికే సదరు ఫాస్టర్ స్వర్గంలో భూముల అమ్మకం ద్వారా లక్షలాది డాలర్లు ఆర్జించాడట. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి డీల్ ఒకటి ఉగాందాలో జరిగింది. యూనివర్సల్ అపొస్తొల్ చర్చి ఫాస్టర్ ఫ్రెడ్ ఇసాంగా కూడా ఇలాగే స్వర్గంలో భూములు అమ్ముతానంటూ ప్రకటనలు గుప్పించాడు. దీంతో ఆయన ఫాలోవర్లు కొంతమంది స్వర్గంలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు భూమి మీద తమకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments