Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో భారీ భూకంపం : 140 మందికి పైగా మృతి

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపంలో 140 మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకునివున్నారు. వీరిలో పెక్కుమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచా

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (08:47 IST)
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. ఈ భూకంపంలో 140 మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకునివున్నారు. వీరిలో పెక్కుమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.
 
ఇటీవల సంభవించిన భూకంపం, తుఫానుకు గురై భారీగా నష్టపోయిన విషయం తెల్సిందే. తాజాగా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం.. మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం సంభవించడంతో ఇళ్లు, కార్యాలయాల్లోని నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. వందలాది మంది సజీవ సమాధి అయ్యారు. మట్టిముద్దగా మెక్సికో సిటీ మారింది. 
 
సెంట్రల్ మెక్సికోలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. దక్షిణ మెక్సికోలో 7.4గా నమోదైంది. భూకంప ధాటికి అనేక ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. 138 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకుని ఉంటారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
 
1985 సెప్టెంబర్ 19న మెక్సికోపై పెను భూకంపం విరుచుకుపడింది. నాడు 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 32 ఏళ్ల తర్వాత సరిగ్గా అదేరోజు మరోసారి భూకంపం సంభవించింది. భూకంపం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అప్రమత్తం చేసిన కొన్ని గంటల్లోనే విపత్తు విరుచుకుపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments