జాతిపిత మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతిని అనుసరించి.. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను లేకుండా చేశారు. ప్రస్తుతం గాంధీజీ వారసులు దేశంలో లేరు. తాజాగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సోషల్ మీడియాలో యాక్టివ్
జాతిపిత మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతిని అనుసరించి.. భారతదేశంలో ఆంగ్లేయుల పాలనను లేకుండా చేశారు. ప్రస్తుతం గాంధీజీ వారసులు దేశంలో లేరు. తాజాగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. ఆమె పేరు మేధా గాంధీ.
మహాత్మాగాంధీకి నలుగురు పుత్రులు. వారిలో హరిలాల్ గాంధీ పుత్రుడు కంతిలాల్ స్వాతంత్ర్యానికి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. కంతిలాల్ కుమార్తె మేధా గాంధీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
స్టైలిష్ లుక్‌తో అదరగొట్టేసింది. ఇంకా వ్యంగ్యమైన ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. కామెడీ పోస్టులతోనూ సై అంటోంది. పారడీ నిర్మాత అయిన ఈమెకు నెట్టింట్లో మాంచి ఫాలోయింగ్ వుంది. మేధా గాంధీ స్టైలిష్ లుక్‌ను మీరూ చూడండి.