Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టు అధికారుల కళ్ళగప్పి ఫ్లైట్ చక్రాల్లో దాక్కుని ప్రయాణం..

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (10:23 IST)
సాధారణంగా రైళ్లు, బస్సుల్లో దొంగతనంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా, రైళ్ళలో అయితే, బాత్రూమ్‌లు సీట్ల కింద దాక్కొని ప్రయాణం చేయొచ్చు. కానీ, విమానాల్లో మాత్రం అలా సాధ్యపడదు. కానీ, ఓ ప్రయాణికుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారుల కళ్లుగప్పి.. ఏకంగా 1640 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాడు. ఈ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చిన తీరు చూసి ఎయిర్‌పోర్టు గ్రౌండ్ సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్యాటెమాల సిటీ నుంచి మియామీకి ఒక విమానం బయలుదేరింది. ఈ విమానం ల్యాండింగ్ గేర్ బాక్స్ లోపల కూర్చొని ఏకంగా 1,640 కిలోమీటర్ల దూరంపాటు నాలుగైదు గంటలు కూర్చొని ప్రయాణం చేశాడు. 
 
ఆ విమానం మియామీలో ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడు బయటకు రాగా, గ్రౌండ్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అలా ప్రయాణించిన ప్రయాణికుడి వివరాలు వెల్లడికాలేదు. అతని వద్ద ఎయిర్ పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments