రేప్ చేసి యువతి బట్టలు తీసుకుని పరారైన కామాంధుడు...

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (18:29 IST)
చట్టాలు కఠినంగా ఉండే దుబాయ్‌లో పట్టపగలే దారుణం జరిగింది. పట్టపగలే పార్కులో ఒక యువతిని అత్యాచారం చేసి ఆమె దుస్తులు తీసుకుని పారిపోయాడు. దుబాయ్‌లో ఓ పబ్లిక్ పార్క్ వద్ద యువజంట నడుస్తూ వెళ్తుండగా ఒక వ్యక్తి వారిని అడ్డగించాడు.

తనను తాను ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి 'మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు' అంటూ వారిని భయపెట్టే విధంగా ప్రశ్నలు కురిపించాడు. గుర్తింపు కార్డులు చూపించాలని లేకుంటే అరెస్ట్ చేస్తానని బెదిరించడంతో, గుర్తింపు కార్డులను ఇంటి దగ్గరే మర్చిపోయానని, సమీపంలోనే తన ఇల్లు ఉందని వెంటనే తీసుకొస్తానని చెప్పి యువతిని అక్కడే వదిలేసి ఆ యువకుడు వెళ్లిపోయాడు.
 
గుర్తింపు కార్డుల కోసం ఇంటికెళ్లిన తన స్నేహితుడి కోసం ఆ యువతి అక్కడే ఒంటరిగా ఉండటంతో ఆమెపై కన్నేసిన ఆ వ్యక్తి ఆమెను సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె దుస్తులన్నింటినీ బలవంతంగా విప్పి ఆమెపై అత్యాచారం చేసి, ఆమె దుస్తులు తీసుకుని అక్కడి నుండి పరారయ్యాడు. 
 
బట్టలు లేకపోవడంతో బయటకురాలేని ఆ యువతి అటువైపుగా వెళ్తున్న వారిని సాయం కోరడంతో స్థానికులు ఆమెను కాపాడి దుస్తులు అందించారు. కొద్దిసేపటికి ఆమె స్నేహితుడు రావడంతో ఇద్దరూ వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు ఆ పార్కులో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments