Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి'... జలగలు ఆరగిస్తూ సూప్‌ తాగేశాడు (వీడియో)

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. చైనాలో పాములు, కప్పలు తింటారని వింటున్నాం. కానీ అక్కడ జలగలను కూడా ఆహారంగా తీసుకుంటున్నారంటే నమ్ముతారా.. అవును నిజం. జలగలను చూస్తేనే జుగుప్స కలుగుతుంది. అంటువంటి ఓ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (10:28 IST)
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. చైనాలో పాములు, కప్పలు తింటారని వింటున్నాం. కానీ అక్కడ జలగలను కూడా ఆహారంగా తీసుకుంటున్నారంటే నమ్ముతారా.. అవును నిజం. జలగలను చూస్తేనే జుగుప్స కలుగుతుంది. అంటువంటి ఓ వ్యక్తి  జలగలను పూటుగా లాగించేస్తున్నాడు. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన ఓ వ్యక్తి రెస్టారెంట్‌కి వెళ్లి సూప్‌ ఆర్డర్‌ చేశాడు. సూప్ తాగడం ఆపేసి అందరూ చూస్తుండగానే తాను తెచ్చుకున్న జలగల్ని ఓ గిన్నెలో వేసి చాప్‌స్టిక్స్‌తో వాటిని సూప్‌లో అద్దుకుని తినేశాడు. అతడిని చూసి అక్కడున్న వారికి నోటమాటరాలేదు. అందరూ వింతగా అతడినే తదేకంగా చూస్తుంటే... జలగలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నాడు. 
 
ఆ వ్యక్తి జలగలు తింటున్న సమయంలో రెస్టారెంట్‌లోని ఓ కస్టమర్‌ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో పోస్ట్‌ చేసిన మూడు గంటల వ్యవధిలోనే వందల మంది వీక్షించారు. అయితే జలగలను చైనీయులు ఎక్కువగా ఔషధాల్లో వినియోగిస్తుంటారు. వాటి వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు రావనేది వారి నమ్మకం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments