Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1కే అన్‌లిమిటెడ్ 4జీ డేటా.. ఐడియా బంపర్ ఆఫర్... కేవలం గంట పాటు మాత్రమే.. ఎలా?

ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేయడంతో బీఎస్ఎన్ఎల్‌తో పాటు.. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను తగ్గిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఐడియా రూపాయిక

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (10:03 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేయడంతో బీఎస్ఎన్ఎల్‌తో పాటు.. ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను తగ్గిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఐడియా రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటాను ప్రవేశపెట్టింది. 
 
మీ వద్ద ఐడియా 4జీ సిమ్‌తోపాటు తప్పనిసరిగా 4జీ సపోర్ట్‌ చేసే ఫోన్‌ ఉండాలి. దీంతో పాటు మీ అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్‌ ఉండాలి. మీ 4జీ హ్యాండ్‌సెట్‌లో ఐడియా సిమ్‌ ఉంచి 411కు కాల్‌ చేయండి. అందులో చెప్పే సూచనలను ఫాలో అవ్వండి. సూచనల్లో మీకు 4జీ డేటాకు సంబంధించిన సమాచారం ఉంటుంది. 
 
ఆఫర్‌ యాక్టివేట్‌ అయిన తరువాత మీకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కన్ఫర్మేమేషన్‌ మెసేజ్‌ వస్తుంది. ఇక మీరు 4జీ అన్‌లిమిటెడ్‌ డేటాను వాడుకోవచ్చు. అయితే ఇది కేవలం ఓ గంట వరకు మాత్రమే. గంట తర్వాత మీకు డేటా పనిచేయదు. ఈ ఆఫర్‌లో మీరు ఐడియా ఇచ్చే సూపర్‌ ఫాస్ట్‌ డేటాను గంట వరకు అపరిమితంగా వాడుకోవచ్చు. 
 
ఈ ఒక్క గంటలో మీరు 4జీబీ నుంచి 5 జీబీ వరకు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఇది యాక్టివేట్‌ అయిన తర్వాత మీ పాత డేటా ప్యాక్‌ వెంటనే ఆగిపోతుంది. ఒకే నంబర్‌పై ఈ ఆఫర్‌ను మూడుసార్లు వాడకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆఫర్‌ పనిచేయదు. వేరే ఫోన్‌ నుంచి ప్రయత్నిస్తే మళ్లీ ఈ ఆఫర్‌ మీకు వచ్చే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments