Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీన్స్, హై హీల్స్‌ ధరించిన మలాలా.. పాక్ ఫైర్.. అండగా నిలిచిన నెటిజన్లు

నోబెల్ అవార్డు గ్రహీత, మలాలా యూసుఫ్ జాయ్ కొత్త లుక్‌తో కూడిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మలాలా అనగానే సంప్రదాయ ముస్లిం వస్త్రాల్లో.. తల మీద వస్త్రం ధరించి కనిపిస్తుంది. అలాంటి మలాలా

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (14:11 IST)
నోబెల్ అవార్డు గ్రహీత, మలాలా యూసుఫ్ జాయ్ కొత్త లుక్‌తో కూడిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మలాలా అనగానే సంప్రదాయ ముస్లిం వస్త్రాల్లో.. తల మీద వస్త్రం ధరించి కనిపిస్తుంది. అలాంటి మలాలా ఒక్కసారిగా జీన్స్, హై హీల్స్ వేసి కనిపించిన ఫోటోను చూసి పాకిస్థానీయులు ఫైర్ అవుతున్నారు.

ప్ర‌స్తుతం ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న మ‌లాలా, సాధారణ యువతిలా జీన్స్, జాకెట్ ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలిక‌ల విద్య కోసం పోరాడి నోబెల్ సాధించిన ఆమె స్కిన్నీ జీన్స్‌, హై హీల్స్‌, బాంబ‌ర్ జాకెట్ ధ‌రించ‌డాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆ ఫొటోనే వైర‌ల్‌గా షేర్ చేస్తూ నానా ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. 
 
కానీ మలాలా డ్రెస్ కోడ్‌పై పాకీస్థానీయులు చేసే కామెంట్లను ఇతర దేశాల నెటిజన్లు తిప్పికొడుతున్నారు. పాకిస్థానీయులు మలాలాను నటి మియా ఖలీఫాతో పోల్చారు. ఇలాంటి డ్రెస్‌‌లు ధరిస్తే పాకిస్థాన్‌కు త్వరలోనే భూకంపం వస్తుంది. అంతేగాకుండా ఇకపై తలపై వస్త్రం వదిలించుకునే రోజులు కూడా దగ్గర్లో వున్నాయంటూ రకరకాల కామెంట్లు చేశారు. మలాలాకు పిచ్చిపట్టిందని.. దేశం పరువు తీసిందని మరికొందరు దుయ్యబట్టారు.

అయితే ఇతర దేశాలకు చెందిన నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతిచ్చారు. పాకిస్థానీయులు మారరంటూ ఫైర్ అయ్యారు. ఆమెకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. ఇన్నాళ్లకు మలాలాకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ కామెంట్లు పెడుతూ భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments