Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు దశాబ్దాల తర్వాత భూమికి చంద్ర శిలలు

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (07:46 IST)
నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి చంద్రుడి మీద నుంచి నమూనాలు (చంద్ర శిలలు) భూమికి చేరనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక మిషన్‌ చేపట్టిన చైనా క్యాప్సుల్స్‌ (చాంగ్‌ 5) వారం కిందటే చైనాపై ల్యాండ్‌ అయ్యింది.

చంద్రుడిపై రాళ్లు, ఇతర మృత్తికలు డ్రిల్లింగ్‌ ద్వారా సమీకరించిన చాంగ్‌ ఆదివారం ఉదయం తిరిగి భూమికి బయల్దేరింది. నాలుగు ఇంజన్లను 22 నిమిషాలు పాటు పని చేయించడం ద్వారా చంద్రుని కక్ష్య నుంచి చాంగ్‌ 5 బయలుదేరిందని చైనా జాతీయ అంతరిక్ష నిర్వహణ సంస్థ (నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

మూడు రోజుల్లో మంగోలియా ప్రాంతానికి చాంగ్‌ 5 చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో జాబిల్లిని చేరుకున్న చాంగ్‌ 5 అక్కడ సుమారు రెండు కిలోల రాళ్ల నమూనాలను సేకరించింది.

1976లో నాటి సోవియట్‌ యూనియన్‌ పంపిన లూనా 24 చంద్రుడి నుంచి నమూనాలను తీసుకొచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో జాబిల్లి నుంచి నమూనాలు తీసుకురావడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments