Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సింహాలు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (12:32 IST)
Lion
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో.. దక్షిణాఫ్రికాలో సింహాలు రోడ్లపైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఈ దృశ్యాన్ని పార్క్ రేంజర్ రిచర్డ్ సౌరీ తన మొబైల్ కెమెరాలో బంధించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చ్ 25 నుంచి విధించిన లాక్ డౌన్‌తో క్రూగర్ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా మూతపడింది. సాధారణంగా పెద్ద పులులు, సింహాలు రాత్రి పూట మాత్రమే రోడ్లపై కనిపిస్తాయి. 
 
క్రూగర్ నేషనల్ పార్కులో సౌరి రేంజర్‌గా అత్యవసర విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒర్పేన్ రెస్ట్ క్యాంపు వైపు వెళ్తుండగా ఆయనకి రోడ్డుపై సింహాలు కనిపించాయి. ఆయన ఐదు మీటర్ల దూరంలోనే ఉండి వాటిని గమనించారు. అవన్నీ నిద్రలో ఉండటం వలన ఆయన ఫొటోలు తీస్తున్నప్పుడు అవి పెద్దగా పట్టించుకోలేదు. వాహనాల్లో ప్రజలను చూడటం కూడా సింహాలకు అలవాటైపోయింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments